తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు..!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 18 నుంచి డిసెంబరు 13 వరకు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్​ పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు..!

By

Published : Oct 21, 2019, 11:45 PM IST

Updated : Oct 22, 2019, 6:45 AM IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయినట్లు సమాచారం. నవంబరు 18న ప్రారంభమై డిసెంబరు 13 వరకు ఇవి కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్‌ పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అలాగే పలు ఆర్డినెన్స్‌లు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేలా కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు ఈ-సిగరెట్లు నిషేధానికి సంబంధించిన అత్యవసరాదేశం బిల్లు రూపంలో వచ్చే అవకాశం ఉంది. గత రెండు సంవత్సరాల్లో శీతాకాల సమావేశాలు నవంబరు 21న ప్రారంభమై జనవరి తొలివారంలో ముగిశాయి.

ఇదీ చూడండి:హరియాణా దంగల్​: 'ఫిర్​ ఏక్​ బార్​ భాజపా సర్కార్'!

Last Updated : Oct 22, 2019, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details