తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మేమొస్తే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్'​

లోక్​సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పెట్రోల్​, డీజిల్​ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు రాహుల్​ గాంధీ. మార్పునకు సమయం ఆసన్నమైందని... ప్రధాని మోదీ సమయం అయిపోందని ట్వీట్ చేశారు.

'మేమొస్తే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్'​

By

Published : May 8, 2019, 4:13 PM IST

Updated : May 8, 2019, 5:35 PM IST

'మేమొస్తే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్'​

సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతోంది. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు మరో రెండు దశలతో ముగియనున్నాయి. ఓటర్లను ఆకర్షించేలా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ మరో హామీ ఇచ్చారు. తమ​ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్​, డీజిల్​ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు నియంత్రించేలా చర్యలు తీసుకుని, సామాన్యుడిపై భారం తగ్గిస్తామని ఫేస్​బుక్​ పోస్ట్​ ద్వారా భరోసా ఇచ్చారు.

మోదీ మీ సమయం అయిపోయింది...

ప్రధాని మోదీపై ట్విట్టర్​ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్. మోదీ సమయం అయిపోయిందని, దేశంలో మార్పునకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

" పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చిన 'కనీస ఆదాయ పథకానికి' మద్దతుగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో యువకులు, పెద్దలు ఓటేస్తున్నారు. వీరితో పాటు అనుభవజ్ఞులు, వృద్ధులు కూడా ఈ ఆలోచన ఎంత శక్తిమంతమైందో అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

దేశవ్యాప్తంగా ఉన్న 20 శాతం మంది పేదలకు ఏడాదికి రూ.72 వేల రూపాయల కనీస ఆదాయం అందిస్తామని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ హామీ ఇచ్చారు.

Last Updated : May 8, 2019, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details