తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధారావిలో కరోనా నియంత్రణ భేష్: డబ్ల్యూహెచ్​ఓ - Mumbai's Dharavi

కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ముంబయిలోని ధారావి మురికివాడలో వైరస్​ను అరికట్టేందుకు మెరుగైన చర్యలు చేపట్టారని ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). వైరస్ విజృంభిస్తున్నప్పటికీ కరోనాను నియంత్రించడం సాధ్యమేనని ధారావి యంత్రాంగం నిరూపించిందన్నారు.

dharavi
ధారావిలో వైరస్ నియంత్రణ భేష్: డబ్ల్యూహెచ్​ఓ

By

Published : Jul 11, 2020, 8:48 AM IST

Updated : Jul 11, 2020, 9:49 AM IST

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబయి ధారావిలో కరోనా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). దేశవ్యాప్త ఐక్యత, అంతర్జాతీయ సోదరభావంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమన్నారు.

"వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్నప్పటికీ నియంత్రణ సాధ్యమే అనడానికి ప్రపంచ వ్యాప్తంగా మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా... ఇంకా ముంబయిలోని ధారావి మురికివాడల కథలే నిదర్శనం. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బాధితుల గుర్తింపు, పరీక్షలు, ఐసోలేషన్​ అనేవి చాలా కీలకం."

-టెడ్రోస్ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్

సమష్టి కార్యాచరణ, ప్రజా భాగస్వామ్యం, సరైన దిశగా నడిపించే నాయకత్వమే ప్రస్తుత తరుణంలో మనకు అవసరమన్నారు అధనోమ్​. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు సహా అనేక దేశాల్లో ఆంక్షలను సడలించడం వల్ల వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చూడండి:సౌర విద్యుత్ వేలంలో భారత్ భేష్​: గుటెరస్​

Last Updated : Jul 11, 2020, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details