సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను సేకరించి ఎఫ్ఎస్టీపీకి తరలిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. వాటిని శుద్ధి చేసేందుకు 4 టన్నుల వ్యర్థాలకు 10 టన్నులకు పైగా మట్టి, గడ్డిని కలుపుతారు. ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా యంత్రాల సాయంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తారు. మిశ్రమాన్ని ప్రత్యేకంగా నిలువ ఉంచుతారు.
మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ! - బెంగళూరు
మానవ వ్యర్థాలను సేకరించి వాటిని ఎరువులుగా తయారు చేస్తోంది బెంగళూరులోని 'ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)'. దేవనహళ్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాంట్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ!
ఎఫ్ఎస్టీపీ కేంద్రంలో రోజుకు 2వేల లీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తారు. తద్వారా తయారైన ఎరువును కేజీకి రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. 65 లక్షల పెట్టుబడితో 2015లో ఎఫ్ఎస్టీపీని స్థాపించారు. బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపార సంస్థ సహకారం అందించింది.
మానవ వ్యర్థాలతో ఎరువులను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పడం బెంగళూరులో ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వం దీని ఆవశ్యకతను గుర్తించి పరిశ్రమకు అవార్డులనూ ప్రకటించింది.