హిమాలయాల సోయగాలు, పచ్చని ప్రకృతికి నెలవైన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో వారం రోజుల పాటు జరిగే దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నిర్వహించిన రఘునాథ్ 'రథయాత్ర'లో వేలాది మంది పాల్గొన్నారు. భక్తులు డప్పులు వాయిస్తూ జానపద నృత్యాలు చేశారు.
కులులో ఘనంగా రఘునాథ్ రథయాత్ర - రథయాత్ర
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో వారం రోజుల పాటు సాగే దసరా ఉత్సవాలు రఘునాథ్ రథయాత్రతో ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కులులో ఘనంగా రఘునాథ్ రథయాత్ర
ఈ ఉత్సవంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి గోవింద్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనల మేరకే రథయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవంలో పాల్గొనే ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం