కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్తో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఝార్ఖండ్ జెంషద్పుర్లో పెళ్లికి వచ్చిన 50 మంది బంధువులు తిరిగి ఇళ్లకు వెళ్లలేక చిక్కుకుపోయారు.
ఒడిశా బలంగీర్ నుంచి మార్చి 16న బయలుదేరి జెంషద్పుర్కు వచ్చారు వీరంతా. పెళ్లి చూసుకుని ఇంటికెళదామనుకునేలోపే.. దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక రవాణా సౌకర్యం లేక వారి ప్రయాణం సాధ్యపడలేదు. విడిదింట్లో అంత మందికి చోటు లేక బంగ్లా పైనే షామియానాలు వేసుకుని కాలం గడుపుతున్నారు.