తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​కు 'వాయు' గండం.. సర్వత్రా అప్రమత్తం - ప్రభావం

గుజరాత్​ సహా ఇతర ప్రాంతాల్లో రెండురోజులా పాటు 'వాయు' తుపాను చూపించే ప్రభావంపై వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. సౌరాష్ట్ర పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొంకణ్ ప్రాంతంలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమనాథ్​ దేవాలయం మాత్రం మూతపడలేదు. పూజలు కొనసాగుతున్నాయి.

గుజరాత్​కు 'వాయు' గండం.. సర్వత్రా అప్రమత్తం

By

Published : Jun 13, 2019, 2:13 PM IST

గుజరాత్ ​వాసులను భయపెడుతున్న 'వాయు' తుపాను... దిశ మారి, పశ్చిమం వైపు ప్రయాణిస్తోందని వాతావరణశాఖ ప్రకటించింది. దిశ మారినా ఆ రాష్ట్రంపై తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై... తగిన చర్యలు చేపట్టాయి.

గుజరాత్​తో పాటు వివిధ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో 'వాయు' తుపాను ప్రభావం ఇలా ఉండనుంది...

కొంకణ్​- గోవా:-

  • కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని వాతావరణశాఖ సూచించింది.

సౌరాష్ట్ర- కచ్​​:-

  • రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
  • మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

గుజరాత్​ ప్రాంతం:-

  • నేడు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
  • రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.
  • ఈ ప్రాంతాల్లో వాతావరణశాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

మూతపడని సోమనాథ్​ ఆలయం..

గుజరాత్​ తీరం అల్లకల్లోలంగా మారినప్పటికీ సోమనాథ్​ దేవాలయం మూతపడలేదు. ఉదయం నుంచి పూజలు జరిగాయి. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి భూపేంద్ర సిన్హా స్పందించారు. ప్రకృతి విపత్తులను ప్రకృతే నిలువరిస్తుందని వ్యాఖ్యానించారు. ఆలయంలో పూజలు కొనసాగుతున్నప్పటికీ... దర్శనానికి రావొద్దని భక్తులకు సూచించినట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details