తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బిహార్ ఎన్నికలను సురక్షితంగా నిర్వహించాం'

కరోనా వేళ పకడ్బందీ ప్రణాళికతో బిహార్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని భారత ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్​ ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు.

cec sunil arora
సునీల్ అరోడా

By

Published : Nov 18, 2020, 8:01 PM IST

కరోనా సమయంలో బిహార్​ ఎన్నికలను చాలా మంది మూర్ఖపు చర్యగా పేర్కొన్నారని సీఈసీ సునీల్ అరోడా తెలిపారు. కానీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పోలింగ్ నిర్వహించగలిగామని స్పష్టం చేశారు. దీని వెనుక ఎంతో కృషి దాగుందన్నారు.

ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సునీల్.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలనూ సజావుగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి అంతర్గత కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.

"బిహార్ ఎన్నికలు సురక్షితంగా జరిగాయి. ప్రతి విషయంలో విమర్శకులు ఉంటారు. వాళ్లు వ్యవస్థలో భాగమే. వచ్చే ఏడాది బంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్​ ప్రకారమే పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. ఎన్నికలు నిరంతర ప్రక్రియ. ఈ విషయంలో మేం ఎలాంటి రాజీ పడబోం."

- సునీల్ అరోడా, భారత ఎన్నికల ప్రధాన అధికారి

ఇదీ చూడండి:బంగాల్​లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details