సామాజిక కార్యకర్త, నోబెల్ గ్రహీత మలాలా యూసూఫ్జాయ్ కశ్మీర్ నిర్ణయంపై తనదైన రీతిలో స్పందించారు. కశ్మీర్ సమస్యను ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా పరిష్కరించాలని ఆమె కోరారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కశ్మీర్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
దక్షిణ ఆసియా నా ఇల్లు. నా కుటుంబంలో కశ్మీర్‌తో సహా 1.8బిలియన్ల మంది జీవిస్తున్నారు. నేను, మా తాత, తల్లిదండ్రలు అంతా చిన్నప్పటి నుంచి ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాంతంలో వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, వివిధ వంటకాలు,ఆచారాలవారు నివసిస్తున్నారు.
-నోబెల్ గ్రహీత మలాలా.
మనం ప్రశాంతంగా జీవించవచ్చు : మలాలా
కశ్మీర్లో నెలకొన్న పరిస్థితిపై మలాలా స్పందించారు. కశ్మీర్ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మనం ప్రశాంతంగా జీవించవచ్చు : మలాలా
ఈ పరిస్థితుల్లో హింసాత్మక ఘటనలు జరిగితే ఎక్కువగా చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇబ్బందులకు గురవుతారని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు హింసకు గురైతే అంతర్జాతీయ అధికారులు స్పందించాలని ఆమె కోరారు. ఏడు దశాబ్దాల కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని మలాలా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : సుష్మ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళ :ఇవాంక