తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ సర్కార్, కేంద్ర బృందాల మధ్య మాటల యుద్ధం! - trinamool latest news

పశ్చిమ్​ బంగాల్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.  మమత సర్కార్​ సహాయ నిరాకరణ చేస్తోందని కేంద్రబృందాలు విమర్శించగా.. రాజకీయ వైరస్​ వ్యాప్తి చేసేందుకే వారు పర్యటిస్తున్నారని తృణమూల్​ ఆరోపించింది.

WB govt not providing logistical support
దీదీ సర్కార్, కేంద్ర బృందాల మధ్య మాటల యుద్ధం

By

Published : Apr 26, 2020, 6:52 AM IST

బంగాల్‌ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని పరిశీలించేందుకు పర్యటిస్తున్న కేంద్ర బృందాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఏ సమాచారం అడిగినా ఇవ్వడం లేదని, లాజిస్టిక్స్‌ సహాయం చేయడం లేదని విమర్శించాయి. దిల్లీలోని తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చిన వారిని గుర్తించడం, క్వారంటైన్‌కు తరలించడం సహా తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ బంగాల్‌ ప్రధాన కార్యదర్శి సిన్హాకు లేఖ రాసినట్లు ఐసీఎంటీకి నేతృత్వం వహిస్తున్న అపూర్వచంద్ర పేర్కొన్నారు. కోల్‌కతాకు వచ్చాక బంగాల్‌ ప్రభుత్వానికి 4 లేఖలు రాసినప్పటికీ ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఐసీఎంటీ బంగాల్‌లో ఎక్కడైనా పర్యటించవచ్చని, వారితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమయం వృథా చేసుకోదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించటం కేంద్ర హోం శాఖ ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. క్షేత్రస్థాయి పర్యటన, లాజిస్టిక్స్‌కు బంగాల్‌ ప్రభుత్వం సహకరించాలని అపూర్వ చంద్ర మరోసారి సిన్హాకు రాసిన లేఖలో కోరారు.

తృణమూల్​ ధ్వజం..

కేంద్ర బృందాలు చేస్తున్న విమర్శలను అధికార తృణమూల్ తిప్పికొట్టింది. బంగాల్​లో రాజకీయ వైరస్​ను వ్యాప్తి చేసేందుకే వీరు పర్యటిస్తున్నారని మండిపడింది. దురుద్దేశంతోనే ఎలాంటి ప్రయోజనం లేని పర్యటన చేపట్టాయని తృణమూల్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్​ ఒబ్రయిన్​ ట్వీట్ చేశారు. ఐసీఎంటీపై ధ్వజమెత్తారు.

కేంద్రబృందాలపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇటీవలే విమర్శలు గుప్పించారు. సరిగ్గా పనిచేయని టెస్టింగ్ కిట్లను రాష్ట్రానికి కేంద్రం పంపినట్లు ఆరోపించారు.

ఇదీ చూడండి: రూ.లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి: సోనియా

ABOUT THE AUTHOR

...view details