ఈ ఏడాది జనవరిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. గత నెలలో దేశవ్యాప్తంగా సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 14.78 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని వివరించింది. దీంతో 62 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేడి జనవరి నెలగా ఇది నిలిచిపోయిందని పేర్కొంది.
దక్షిణ భారతదేశంలో ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. అక్కడ సరాసరి 22.33 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. 121 ఏళ్లలో జనవరిలో ఎన్నడూ ఆ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి లేదని వివరించింది.