తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీవీప్యాట్ స్లిప్పులపై ఈసీని కలిసిన విపక్షాలు - ఎన్నికల కమిషన్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీల నేతలు నేడు ఎన్నికల సంఘాన్ని మరోసారి కలిశాయి. ఓట్ల లెక్కింపులో 50 శాతం వీవీప్యాట్  స్లిప్పులు లెక్కించాలని విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను నేడు సుప్రీం కొట్టివేసింది. మరోసారి ఈ విషయంపై ఈసీని ఆశ్రయించాయి విపక్షాలు.

వీవీ ప్యాట్లపై ఈసీని కలిసిన 21 పార్టీల నేతలు

By

Published : May 7, 2019, 11:09 PM IST

Updated : May 7, 2019, 11:59 PM IST

ఓట్ల లెక్కింపులో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీల నేతలు ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. విశ్వసనీయత, పారదర్శకత కోసం 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని అది సాధ్యంకాకపోతే 25 శాతం లేదా 15 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 5 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో తేడా వస్తే ఆ నియోజకర్గంలోని మొత్తం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు ఈసీని కోరాయి.

"సుప్రీం ఆదేశాలకనుగుణంగా 5 వీవీప్యాట్లను లెక్కించే అంశమై పునారాలోచించాలని ఎన్నికల కమిషన్​కు నివేదించాం. ఈ అంశంలో 5 వీవీప్యాట్ల కంటే ఎక్కువ లెక్కించకూడదని ఏ నిబంధనా, చట్టం లేదు. మీరు మా కోరిక మేరకు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించలేకపోతే 25 శాతాన్ని లెక్కించాలని కోరాం. 15 శాతాన్నైనా లెక్కించమన్నాం. స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ విషయంలో సుప్రీం ఏ విధమైన నియంత్రణ విధించలేదు. అయినప్పటికీ 5 వీవీ ప్యాట్ల కంటే మించి లెక్కించేందుకు ఎన్నికల సంఘం అంగీకరించలేదు."

-అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్​​ నేత

వీవీప్యాట్ స్లిప్పులపై ఈసీని కలిసిన విపక్షాలు

ఇదీ చూడండి: ఈవీఎంలను హోటల్​కు తరలించిన అధికారి

Last Updated : May 7, 2019, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details