తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: మూడు గంటల్లో కేవలం 6.28 శాతం! - delhi vidhan sabha election 2020

దిల్లీలో పోలింగ్​​ ప్రారంభమైన మూడు గంటల్లో కేవలం 6.28 శాతం ఓటింగ్ నమోదైంది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మోరాయించాయి. అయితే రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి కోవింద్​, కాంగ్రెస్​-ఆప్​-భాజపా నేతలు పోలింగ్​ కేంద్రాలకు తరలివెళుతున్నారు.

VOTING PERCENTAGE TILL 11AM OF DELHI ELECTIONS
దిల్లీ దంగల్​: మూడు గంటల్లో కేవలం 6.96 శాతం!

By

Published : Feb 8, 2020, 11:56 AM IST

Updated : Feb 29, 2020, 3:07 PM IST

దిల్లీ దంగల్​: మూడు గంటల్లో కేవలం 6.28 శాతం!

దిల్లీ పోలింగ్​ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు కేవలం 6.28 శాతం ఓటింగ్​ నమోదైంది.

ప్రజలు ఇలా...

పలు ప్రాంతాల్లో పోలింగ్​ కేంద్రాలు రద్దీగా కనిపించినా... ఎన్నికలు ప్రారంభమైన తొలి గంటలో 3.66 శాతం ఓటింగ్​ నమోదైంది. షాకర్​పుర్​లో ఓ వరుడు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దిల్లీలోనే అతి పెద్ద వయస్కురాలు కలితారా మండల్​.. గ్రేటర్​ కైలాశ్​లో ఓటు వేశారు. 110 ఏళ్ల వయస్సులో చక్రాల కుర్చీ సహాయంతో తన బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న కలితారాను అధికారులు అభినందించారు.

పౌర నిరసనలతో అట్టుడికి జామియా, షహీన్​బాగ్​ ప్రాంతాల్లో పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. భారీ భద్రత మధ్య ఓటర్లు క్యూలో ముందుకు సాగుతున్నారు.

మరోవైపు యమున విహార్​లోని సీ-10 బ్లాక్​ వద్ద ఈవీఎం మొరాయించింది. దీని వల్ల ఆ కేంద్రంలో ఓటింగ్​ ఇంకా మొదలుకాలేదు. న్యూదిల్లీ నియోజకవర్గంలోని సర్దార్​ పటేల్​ విద్యాలయం(బూత్​ నం. 114)లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఓటింగ్​ నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ప్రముఖుల ఓట్లు...

సామాన్యులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. న్యూ దిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.. కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ఓటు వేసి సిరా చుక్క గుర్తును ప్రదర్శించారు.

అంతకుముందు తుగ్లక్​ క్రిసెంట్​ వద్ద విదేశాంగమంత్రి జయ్​శంకర్​, కరోల్​బాగ్​లో భాజపా నేత రామ్​​ మాధవ్​, న్యూదిల్లీలో మాజీ ఉపరాష్ట్రపతి హమిద్​ అన్సారీ, గ్రేటర్​ కైలాశ్​ వద్ద లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బాయ్​జల్​ ఓట్ల పండుగలో పాల్గొన్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మోదీ ట్వీట్​...

దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్యంలోని అతిపెద్ద హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్​... సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Last Updated : Feb 29, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details