తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంటరీ కమిటీల భేటీపై ఉపరాష్ట్రపతి సమీక్ష - Venkaiah Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్థాయీ సంఘాలు, ఇతర కమిటీల సమావేశ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ ​జోషి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియను.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Venkaiah Naidu reviews preparedness for holding regular parl panel meetings
పార్లమెంటరీ కమిటీల భేటీపై ఉపరాష్ట్రపతి సమీక్ష

By

Published : May 25, 2020, 1:59 PM IST

పార్లమెంటరీ స్థాయీ సంఘాలు, ఇతర కమిటీల సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై.. పార్లమెంట్‌ సచివాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్​జోషి, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

స్థాయీ సంఘాల సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వీలైనంత తక్కువ సంఖ్యలో సభ్యులు హాజరయ్యేలా చూడటమే కాకుండా.. కరోనా దృష్ట్యా భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశాల కోసం పార్లమెంట్‌తో పాటు, అదనంగా అనెక్సీ భవనంలో గదులను సైతం ఉపయోగించుకునే అంశంపై.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు ఉభయ సభల సెక్రటరీ జనరల్స్​​తోనూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య చర్చలు జరిపారు.

అలాగే సమావేశాల కోసం మైక్రో ఫోన్లు, అదనపు సీట్ల ఏర్పాటు, సహా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారానికి తగిన ఏర్పాట్లు, అధికారిక ప్రక్రియను.. త్వరితగతిన పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడిన 18 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించే అంశంపైనా.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య చర్చించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:ఆన్​లైన్​ స్నేహాలపై 'సీబీఎస్​ఈ' ప్రత్యేక పాఠాలు!

ABOUT THE AUTHOR

...view details