తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాయు' వేగంతో దూసుకొస్తోన్న తీవ్ర తుపాను

గుజరాత్​ మీదుగా పయనించనున్న 'వాయు' తుపాను తీవ్ర రూపం దాల్చనుంది. జూన్​ 13న ఉదయం గుజరాత్​లోని పోర్​బందర్​- మహువా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 120- 135 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

తీవ్ర తుపానుగా మారనున్న 'వాయు'

By

Published : Jun 11, 2019, 11:08 AM IST

Updated : Jun 11, 2019, 12:30 PM IST

లక్షద్వీప్, తూర్పు మధ్య అరేబియా సముద్రాన్ని ఆనుకుని నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు మనదేశం సూచించిన ‘వాయు’ పేరు పెట్టారు.

వాయు తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదిలి గుజరాత్ వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో నేటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 13వ తేదీకి ఇది తీవ్ర తుపానుగా మారి గుజరాత్ పోర్​బందర్- మహువా మధ్య తీరం దాటుతుందని ఐఎమ్​డీ అంచనా వేసింది.

తీరం దాటే సమంయలో గంటకు 120- 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ వాయు తుపాను ప్రభావం ముంబై నగరంపైనా తీవ్రంగానే ఉండనుంది. సౌరాష్ట్ర, కుచ్​ తీర ప్రాంతాల్లో జూన్​ 13, 14 రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్​డీ హెచ్చరించింది.

ఇప్పటికే తీర ప్రాంత వాసులకు, మత్స్యకారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది గుజరాత్​ ప్రభుత్వం. ఎన్​డీఆర్ఎఫ్​ బృందాలను సౌరాష్ట్ర, కుచ్ తీర ప్రాంతాల్లో మోహరించింది.

Last Updated : Jun 11, 2019, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details