తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు! - నీటి సంరక్షణ

నీరు లేనిదే జీవం లేదు. సకల చరాచర జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ సత్యాన్ని గ్రహించి అందుకోసం అనునిత్యం పాటుపడుతున్నారు కేరళకు చెందిన వర్గీస్​ తారకన్​ అనే రైతు. వినూత్నంగా వాన నీటిని ఒడిసి పడుతూ... ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలా చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!

By

Published : Jul 25, 2019, 3:29 PM IST

Updated : Jul 25, 2019, 10:54 PM IST

భూగర్భ జలాలను పెంచిన రైతు

కేరళలోని త్రిసూర్​ జిల్లా కుందంకులం తాలూక్ వేలూర్ గ్రామ రైతు వర్గీస్​ తారకన్​ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. సీజన్​తో సంబంధం లేకుండా పనస పంట సాగులో మంచి దిగుబడి పొందుతూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు పాటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే 'క్షోని మిత్రా' అవార్డును సొంతం చేసుకున్నారు.

కొండ ప్రాంతంలోని తన ఐదెకరాల్లో సాగు చేస్తున్న పనస పంటకు నీటిని అందించేందుకు సరికొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు వర్గీస్​. వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోనికి ఇంకిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొక్కల వరుసల మధ్య కందకాలు ఏర్పాటు చేశారు. వర్షం పడినప్పుడు అందులో నీరు నిల్వ ఉండటమే కాదు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు వర్గీస్​. ఒకప్పడు ఈ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం చూపారు.

" కేరళ త్వరలోనే ఎడారిగా మారే ప్రమాదముంది. అలా జరగకూడదనే నేను కురుమాల్ కొండల్లో వర్షపు నీటిని సంరక్షించే పద్ధతిని అనుసరిస్తున్నాను. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చకపోతే కేరళ ఎడారిగా అవతరిస్తుంది. పచ్చదనం కనుమరుగవుతుంది. కేరళలో అత్యంత కాలుష్య నగరం త్రిసూర్​. ఈ పద్ధతి ద్వారా వర్షం నీటిని సేకరించి భూగర్భ జలాలుగా మార్చాలి. కేంద్ర నీటి పరిశోధన సంస్థ వివరాల ప్రకారం సెంటు భూమిలో లక్ష 12వేల లీటర్ల వర్షపు నీరు పారుతుంది. ఈ నీరు అరేబియా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలి. మనం బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకుంటాం. అవసరమైనపుడు తీసుకుంటాం. అదే విధంగా వర్షపు నీటిని ఆదా చేసి.. నీటి కొరత ఉన్నప్పడు వినియోగించుకోవాలి "
-వర్గీస్​ తారకన్, రైతు

విభిన్న పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న రైతు పేరును అమెరికా అందించే 'వాఫా' పురస్కారానికి ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం.

ఇదీ చూడండి: రాజీవ్ హత్యకేసులో దోషి నళిని విడుదల

Last Updated : Jul 25, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details