ఉత్తర్ప్రదేశ్లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గోండా జిల్లాలోని పక్కా గ్రామంలో ఇంట్లో నిద్రిస్తోన్న ముగ్గురు దళిత అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అక్కకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు చెల్లెళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.
యూపీలో మరో ఘోరం- అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి - యూపీ న్యూస్
ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తోన్న ముగ్గురు దళిత అక్కాచెల్లెళ్లపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
యూపీలో మరో ఘోరం- దళిత యువతులపై యాసిడ్ దాడి
స్థానికుల సమాచారంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని.. యాసిడ్ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'హాథ్రస్' దర్యాప్తు ముమ్మరం- ఘటనా స్థలానికి సీబీఐ