కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ ఘాజీపుర్లో జరిగింది. ఆరు నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు ఆ కిరాతకుడు. భార్త ప్రవర్తనను గమనించిన భార్య.. తన పద్దతిని మార్చుకోమని చెప్పింది. అయినా అతడు వినపించుకోలేదు. దీంతో బాలిక తల్లి స్థానిక దుల్హాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కన్న కూతురిపై తండ్రి ఆరు నెలలుగా..
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నాన్నే ఆ బాలికపై కర్కశత్వం ప్రదర్శించాడు. కన్న కూతురని చూడకుండా ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. భర్త ప్రవర్తనను గమనించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
కన్న కూతురిపై తండ్రి ఆరు నెలలుగా ..
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఘాజీపుర్ ఎస్పీ ఓం ప్రకాశ్ సింగ్ తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.