కరోనాతో యూపీ మంత్రి కమలా రాణి కన్నుమూత - covid-19
10:54 August 02
కరోనాతో యూపీ మంత్రి కమలా రాణి కన్నుమూత
ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్(62) కన్నుమూశారు. ఆమెకు జులై 18న కరోనా సోకగా.. లఖ్‌నవూలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు.
కమలా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఆమె మంచి నాయకురాలు అని, రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మంత్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 36 వేల మందికిపైగా వైరస్ సోకింది. మరో 1677 మంది చనిపోయారు.