ఎటూ చూసినా ట్రంప్, మోదీ చిత్రాలు, భారీ కటౌట్లు, బ్యాండ్ బాజాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్షలమంది జనాలు.. ట్రంప్ తొలిరోజు పర్యటన విశేషాలు ఎన్నో.. మరెన్నో.
నమస్తే ట్రంప్: పర్యటన తొలిరోజు హైలైట్స్ - trump india visit
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిరోజు భారత పర్యటన అట్టహాసంగా సాగింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొదలుకొని తాజ్‌మహల్ సందర్శన వరకు భారత ఆతిథ్యం ట్రంప్ దంపతులను విశేషంగా ఆకట్టుకుంది.
నమస్తే ట్రంప్: పర్యటన తొలిరోజు హైలైట్స్
తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్యాధిపతికి ఎన్నడూ ఊహించని ఆతిథ్యం దక్కింది. మొదటి రోజు ట్రంప్ పర్యటన హైలైట్స్ ఇవే.
- అహ్మదాబాద్ విమానాశ్రయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం.
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్.
- విమానాశ్రయం నుంచి ఎటు చూసినా జనాలతో 22 కిమీ భారీ రోడ్ షో.
- సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికిన ట్రంప్.
- 'నమస్తే ట్రంప్' కార్యక్రమం వేళ కిక్కిరిసిన మోటేరా స్టేడియం- లక్ష మందికిపైగా హాజరు.
- ట్రంప్ పర్యటన భారత్-అమెరికా మైత్రిలో కొత్త అధ్యాయంగా పేర్కొన్న మోదీ.
- ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ ప్రకటన.
- 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం.
- భారత్-అమెరికా మధ్య బ్రహ్మాండమైన వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ ధీమా.
- క్రికెట్ దిగ్గజం సచిన్, కోహ్లీ, బాలీవుడ్ చిత్రపరిశ్రమను ప్రశంసించిన డొనాల్డ్.
- కుటుంబసమేతంగా తాజ్ మహల్‌ను సందర్శించిన అగ్రరాజ్యాధిపతి.
- రేపటి పర్యటన కోసం అధ్యక్షుడి దిల్లీ పయనం.
- ఇదీ చూడండి:'తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్‌తో స్నేహగీతం'
Last Updated : Mar 2, 2020, 10:44 AM IST