భారత్ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఉన్నతస్థాయి చర్చల కోసం ఓ విదేశీ మంత్రి భారత్కు రావడం ఇదే తొలిసారి.
జీ20 నేపథ్యంలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాంపియో బుధవారం భేటీకానున్నారు. ఈ వారాంతంలో జపాన్ వేదికగా జరగనున్న జీ20 సదస్సులో భాగంగా మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమవనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న మోదీ- పాంపియో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.