తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నామినేషన్​ వేసిన ఊర్మిళ, ప్రియాదత్​ - Urmila Matondkar

ప్రముఖ బాలీవుడ్​ నటి ఊర్మిళా మాతోంద్కర్ లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున నామినేషన్​ దాఖలు చేశారు. అభిమానులు, కార్యకర్తల నడుమ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి... ఉత్తర ముంబయి స్థానానికి నామపత్రాలు సమర్పించారు. సంజయ్​దత్​ సోదరి, ప్రియాదత్ ముంబయి నార్త్​ సెంట్రల్​ నుంచి నామినేషన్​ వేశారు. ఈ నెల 29న జరగనున్న నాలుగో విడత ఎన్నికల్లో ఇరువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.​

ఊర్మిళా మతోంద్కర్, ప్రియాదత్​ల నామినేషన్

By

Published : Apr 8, 2019, 5:42 PM IST

Updated : Apr 8, 2019, 6:06 PM IST

నామినేషన్​ వేసిన ఊర్మిళ, ప్రియాదత్​

ముంబయిలో లోక్​సభ ఎన్నికల నాలుగో దశకు నామినేషన్లు జోరందుకున్నాయి. సినీనటి ఊర్మిళా మాతోంద్కర్​ కాంగ్రెస్​ తరఫున 'ఉత్తర ముంబయి'​ నుంచి నామపత్రం​ దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి గోపాల్​ శెట్టిపై ఎన్నికల బరిలో దిగారు ఆమె. నామినేషన్​ అనంతరం అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఊర్మిళ.

సంజయ్​దత్​ సోదరి ప్రియాదత్​ కాంగ్రెస్ తరఫున 'ముంబయి నార్త్​ సెంట్రల్​' నుంచి నామపత్రాలు దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి పూనమ్​ మహాజన్ ఈస్థానం నుంచి ప్రియ​పై పోటీ చేస్తున్నారు. నామపత్రాలు సమర్పించేందుకు సోదరికి తోడుగా వెళ్లాడు సంజయ్​దత్.

కాంగ్రెస్​ అభ్యర్థి సంజయ్​ నిరుపమ్(వాయవ్య ముంబయి)​, శివసేన అభ్యర్థి రాహుల్​ షేవాలా(దక్షిణ మధ్య ముంబయి​) తో పాటు మరికొందరు నేతలు నామినేషన్లు సమర్పించారు.
నామపత్రాలను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 11 చివరి తేదీ.

నాలుగు దశల్లో పోలింగ్​

మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్​సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత(ఏప్రిల్​ 11)లో 7 , రెండో విడత(ఏప్రిల్​ 18)లో 10 , మూడో విడత(ఏప్రిల్​23)లో 14, నాలుగో విడత(ఏప్రిల్​ 29)లో మిగతా 17 స్థానాలకు పోలింగ్​ జరగనుంది.

Last Updated : Apr 8, 2019, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details