స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయంగా నిలిచిన మహిళా అధికారి మేజర్ శ్వేతా పాండేకు సొంత రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమ బిడ్డ శ్వేతాపై గర్వంగా ఉందని లఖ్నవూ ప్రజలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శ్వేతా తండ్రి రాజ్ రతన్ పాండే.. 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుమార్తె మోదీకి సహయం చేయడమే కాకుండా.. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్లో మూడు రక్షణ దళాలకు నేతృత్వం వహించినట్టు పేర్కొన్నారు. అక్కడ శ్వేతా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్టు గర్వంగా చెప్పారు.
ఆర్మీ నిబంధనల కారణంగా మీడియాతో మాట్లాడటానికి మేజర్ శ్వేతా పాండే విముఖత వ్యక్తం చేశారు. అయితే.. ప్రధాని వద్ద ఫ్లాగ్ ఆఫీసర్గా ఉండటం ఎంతో గౌరవంగా, సంతృప్తికరంగా ఉన్నట్టు వెల్లడించారు.