తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ మంత్రి దంపతులకు కరోనా పాజిటివ్ - ఉత్తరప్రదేశ్​ కరోనా పరిస్థితి

ఉత్తర్​ప్రదేశ్​ గ్రామీణాభివృద్ధి మంత్రి రాజేంద్ర ప్రతాప్​ సింగ్​కు కరోనా సోకింది. ఆయన సతీమణికి కూడా పాజిటివ్​గా నిర్ధరణయినట్లు అధికారులు వెల్లడించారు.

UP minister, wife test positive for COVID-19, admitted to hospital
ఆ రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్​

By

Published : Jul 4, 2020, 12:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గ్రామీణాభివృద్ధి మంత్రి రాజేంద్ర ప్రతాప్​ సింగ్​కు కరోనా పాటిజివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. సదరు మంత్రి సతీమణికి కూడా మహమ్మారి సోకినట్లు వెల్లడించారు.

పాటిజివ్​గా తేలిన వెంటనే మంత్రిని, ఆయన భార్యను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి‌లో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

మంత్రికి కరోనా సోకినట్లు తెలుసుకున్న అధికారులు మంత్రితో సంబంధం ఉన్న వారి ఆచూకిీ తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్రతాప్‌గఢ్​​ జిల్లా పట్టి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రతాప్​ సింగ్​ గెలిచారు.

ఇదీ చూడండి:మూగజీవి మౌనరోదన.. పేలుడు పదార్థం తిన్న వృషభం

ABOUT THE AUTHOR

...view details