ఉత్తర్‌ప్రదేశ్ హాపుర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహింద్ర పికప్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనివీరంతా స్వగ్రామం చేరుకునే క్రమంలో ప్రమాదం జరిగింది.
ఇదీ జరిగింది:
ఉత్తర్‌ప్రదేశ్ హాపుర్ జిల్లా సాలెపుర్ కోట్ల గ్రామస్థులకు.. వివాహ వేడుకలో పాల్గొన్న ఉత్సాహం కొద్ది గంటల్లోనే విషాదంగా మారింది. హాపుర్‌లో ఆదివారం తమ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తి కుమార్తె పెళ్లికి హాజరై మహింద్రా పికప్ వాహనంలో స్వగ్రామానికి పయనమయ్యారు గ్రామస్థులు. ఈ క్రమంలో సాదిక్పుర్ గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం మహింద్ర పికప్‌ను కుడివైపు బలంగా ఢీకొట్టింది...అంతే గ్రామస్థులు ప్రయాణిస్తున్న వాహనం అమాంతం గాల్లో ఎగిరిపడింది.
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు తమ సొంత వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.