తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 2.0 కేబినెట్​: పెద్ద రాష్ట్రానికే అగ్రతాంబూలం - CABINET

కొత్తగా కొలువు తీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యధికంగా ఉత్తర్​ప్రదేశ్​ నుంచి 10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. మహారాష్ట్ర నుంచి ఏడుగురు, బిహార్​ నుంచి ఆరుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మోదీ 2.0 కేబినెట్​: పెద్ద రాష్ట్రానికే అగ్రతాంబూలం

By

Published : May 31, 2019, 6:35 AM IST

Updated : May 31, 2019, 8:03 AM IST

పెద్ద రాష్ట్రానికే అగ్రతాంబూలం

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా 58 మందితో మంత్రి వర్గం ఏర్పాటయింది. కీలక రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​ నుంచి అత్యధికంగా 10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. యూపీ వారణాసి నుంచి మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, లఖ్​నవూ ఎంపీ స్థానం నుంచి రాజ్​నాథ్​ సింగ్​ గెలుపొందారు.

ఏడుగురు మంత్రులతో యూపీ తర్వాత రెండోస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఆరుగురు మంత్రులతో బిహార్​కు మూడో స్థానం దక్కింది.

గుజరాత్, రాజస్థాన్​, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రి వర్గంలో అవకాశం లభించింది. పశ్చిమ్​బంగ, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇద్దరిని చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్​, హరియాణాలో భాజపా క్లీన్​స్వీప్​ చేసింది.

ఆంధ్రప్రదేశ్​, ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్​, మణిపుర్​, మిజోరం, సిక్కిం, త్రిపుర తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకూ కేబినెట్​లో ప్రాతినిధ్యం దక్కింది.

యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు.

నరేంద్ర మోదీ, రాజ్​నాథ్​ సింగ్​, స్మృతి ఇరానీ, మహేంద్ర నాథ్ పాండే, సంజీవ్​ బల్యాన్​, సాధ్వి నిరంజన్​ జ్యోతి, వీకే.సింగ్​, సంతోష్​ గాంగ్వర్​, హర్​దీప్​ సింగ్​ పూరీ, ముఖ్తార్ అబ్బాస్​ నఖ్వీలు ఉత్తర్​ప్రదేశ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

యూపీలో మొత్తం 80 లోక్​సభ స్థానాలకు గానూ 62 స్థానాల్లో భాజపా గెలుపొందింది. ఎన్డీఏ కూటమికి 64 స్థానాలు దక్కాయి.

మహారాష్ట్ర నుంచి..

నితిన్​ గడ్కరీ, ప్రకాశ్​ జావడేకర్​, పీయుష్​ గోయల్​, అరవింద్​ సావంత్​, దన్వి పాటిల్​, రామదాస్​ అథవాలే, శ్యాం​రావ్​ ధోత్రే మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బిహార్​ నుంచి

రామ్​ విలామ్ పాసవాన్​, రవిశంకర్​ ప్రసాద్​, గిరిరాజ్​ సింగ్​, ఆర్​కే సింగ్​, అశ్వనీ కుమార్​ చౌబే, నిత్యానంద్​ రాయ్ బిహార్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దిల్లీలో మొత్తం 7 స్థానాల్లో గెలుపొందింది భాజపా. ఇక్కడి నుంచి హర్ష వర్ధన్​కు కేబినెట్​లో చోటు దక్కింది.

ఇదీ చూడండి: నమో 2.0 : మంత్రివర్గం నుంచి సీనియర్లకు ఉద్వాసన

Last Updated : May 31, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details