తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ సీట్లలో పోటీ చేయం:కాంగ్రెస్ - BSP

ఉత్తర్​ప్రదేశ్​లోని ఏడు లోక్​సభ స్థానాల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. ఎస్పీ-బీఎస్పీ కూటమి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాజ్​బబ్బర్​ తెలిపారు.

'ఆ స్థానాల్లో పోటీ చేయం'

By

Published : Mar 17, 2019, 7:29 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో లోక్​సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్​ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్​లో సమాజ్​వాదీ-బహుజన్​ సమాజ్​ పార్టీల కూటమి కోసం ఏడు స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టబోమని ప్రకటించింది.

మాయావతి సహా ఆ కూటమిలోని ముఖ్య నేతలు బరిలో దిగే ఏడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయబోదని స్పష్టం చేశారు యూపీ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాజ్​ బబ్బర్​.

'ఆ స్థానాల్లో పోటీ చేయం'

"సమాజ్​వాది పార్టీ, బహుజన్​ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్​దళ్​ పార్టీల కోసం కాంగ్రెస్​ పార్టీ ఏడు స్థానాలను వదులుకుంటోంది. మాయవతి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయదు." -రాజ్​ బబ్బర్​, ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు.

ఆ ఏడు స్థానాల్లో మైన్​పురి, కన్నౌజ్​, ఫిరోజాబాద్​లు ఉన్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు మరిన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు రాజ్​ బబ్బర్​ తెలిపారు. రెండు స్థానాలను అప్నాదళ్​కు ఇవ్వనున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details