తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం యోగికి ఈసీ షోకాజ్​ నోటీసులు - షోకాజ్​ నోటీసులు

సైన్యాన్ని 'మోదీసేన' అనడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఘజియాబాద్​లో గతవారం జరిగిన  ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు యోగి.

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​

By

Published : Apr 4, 2019, 6:49 AM IST

Updated : Apr 4, 2019, 7:40 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులు
ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ఘజియాబాద్​లో గతవారం జరిగిన సభలో సైన్యాన్ని 'మోదీసేన' అంటూ వ్యాఖ్యలు చేశారు యోగి. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు పంపింది.

సాయుధ దళాల చర్యలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదనే ఈసీ నిబంధనను యోగి ఉల్లంఘించారని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కల్లా స్పందించాలని యోగికి ఈసీ సూచించినట్టు సమాచారం.

ఘజియాబాద్​ జిల్లా మేజిస్ట్రేట్​ సమర్పించిన వీడియో క్లిప్పుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.

ఘజియాబాద్​లో గత ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు యోగి ఆదిత్యనాథ్​. ఉగ్రవాదం పట్ల కాంగ్రెస్​ వైఖరిని విమర్శించారు. ప్రధాని మోదీని ప్రశంసించారు.

" కాంగ్రెస్​ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టారు. ఇప్పుజు మోదీ కీ సేన(మోదీ సైన్యం)మాత్రం ఉగ్రవాదులకు తూటాలు, బాంబుల రుచి చూపిస్తోంది. ఇదే రెండు పార్టీల మధ్య భేదం. మసూద్​జీ అంటూ కాంగ్రెస్​ నేతలు ఉగ్రవాదులను గౌరవిస్తున్నారు"

-- ఘజియాబాద్​ సభలో యోగి వ్యాఖ్యలు

దేశ భద్రతా దళాలు చేసిన పనులను ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవద్దని గతేడాది 19వ తేదీన ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను సూచనలు జారీ చేసింది. సైనికుల ఫొటోలు, పేర్లను వినియోగించకూడదని ఆదేశించింది.

Last Updated : Apr 4, 2019, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details