తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసహనం, హింసతో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం' - రాజీవ్​గాంధీ జయంతి

రాజీవ్​ గాంధీ 75వ జయంతి సందర్భంగా దిల్లీలో రాజీవ్​ యూత్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​.. దేశంలో పెరుగుతున్న అసహనం, హింసాత్మక ఘటనలతో రాజ్యాంగానికి నష్టం జరుగుతోందన్నారు.

'అసహనం, హింసతో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం'

By

Published : Aug 20, 2019, 3:27 PM IST

Updated : Sep 27, 2019, 4:12 PM IST

దేశంలో నానాటికీ పెరుగుతున్న అసహనం, మతపరమైన విభజన, హింసతో రాజ్యాంగానికి నష్టం జరుగుతోందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్న ఇలాంటి ఉదంతాలను సహించకూడదని అభిప్రాయపడ్డారు.

రాజీవ్​ గాంధీ 75వ జయంతి సందర్భంగా దిల్లీలో రాజీవ్​ యూత్​ ఫౌండేషన్​ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మన్మోహన్​. రాజ్యాంగానికి నష్టం చేసే చర్యలకు అడ్డుకట్ట వేయడానికి దేశ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

'భారత్​ను ఎవరూ విభజించలేరు. లౌకికవాదమే మన జాతీయవాదం. అది సహనానికి మించినది. ఏ మతం కూడా హింసను బోధించదు. స్వార్థపరమైన ఆలోచనలు ఎంతో ప్రమాదకరం. ఇలాంటివే దేశవిభజనకు దారి తీస్తాయి.'
- మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధాని

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ అనుసంధానం తప్పదా?

Last Updated : Sep 27, 2019, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details