తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్​ కేసు స్థితి నివేదిక కోరిన సుప్రీంకోర్టు

ఉన్నావ్​ అత్యాచార కేసు విచారణ స్థితి నివేదిక సమర్పించాలని సీబీఐ ట్రయల్​ కోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.

ఉన్నావ్​ కేసు స్థితి నివేదిక కోరిన సుప్రీంకోర్టు

By

Published : Sep 2, 2019, 3:23 PM IST

Updated : Sep 29, 2019, 4:20 AM IST

ఉన్నావ్​ అత్యాచార కేసుపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. కేసుకు సంబంధించిన స్థితి నివేదిక సమర్పించాలని సీబీఐ ట్రయల్​ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.

విచారణ సమయాన్ని పొడిగించాలని అత్యాచార కేసులోని ఓ నిందితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించేందుకు నిందితులకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించాడు. ఇది అన్యాయమైన విచారణ అని పేర్కొన్నాడు.

బాధితురాలి వాంగ్మూలం నమోదు...

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసింది సీబీఐ. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న యువతి వాంగ్మూలం నమోదు చేసింది.

2017లో భాజపా ఎమ్మెల్యే కుల్దీప్​ సింగ్​ సెంగార్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె ఆరోపించింది. ఇటీవల బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో బాధితురాలి బంధువులు మరణించగా.. ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సెంగార్​ హస్తమున్నట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు.

ఇదీ చూడండి: అయోధ్య కేసు న్యాయవాది రాజీవ్​కు బెదిరింపులు!

Last Updated : Sep 29, 2019, 4:20 AM IST

ABOUT THE AUTHOR

...view details