తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

సంచలనం రేపిన ఉత్తర్​ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న 5 కేసులను ఉత్తర్​ప్రదేశ్‌ నుంచి దిల్లీ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని కేసులపై రోజు వారీ దర్యాప్తు ప్రారంభించి.. 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

By

Published : Aug 1, 2019, 3:39 PM IST

Updated : Aug 1, 2019, 4:53 PM IST

'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

ఉత్తర్​ప్రదేశ్‌లో జరిగిన ఉన్నావ్​ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.

ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్న 5 కేసులను ఉత్తర్​ప్రదేశ్‌లోని సీబీఐ న్యాయస్థానం నుంచి దిల్లీ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అన్ని కేసులపై రోజు వారీ దర్యాప్తు ప్రారంభించి.. 45 రోజుల్లో పూర్తి చేయాలని దిల్లీ సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించింది.

తాత్కాలిక సాయం కింద బాధితురాలు, ఆమె న్యాయవాదికి చెరో 25 లక్షల రూపాయలను రేపటిలోగా చెల్లించాలని ఉత్తర్​ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితురాలు, ఆమె తల్లి, నలుగురు సోదరులు, సన్నిహిత కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదికి తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. బాధితురాలి తల్లికి సీఆర్​పీఎఫ్​ భద్రత కల్పిస్తుందని ధర్మాసనం తెలిపింది.

నిర్ణయం కుటుంబానిదే...

ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం లఖ్‌నవూలో చికిత్స పొందుతున్నారు బాధితురాలు, ఆమె న్యాయవాది. వీరిని మరింత మెరుగైన వైద్యం కోసం దిల్లీ తరలించే అంశంపై ఆమె కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.

బాధితురాలి కారు ప్రమాదంపై దర్యాప్తును 7 రోజుల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప పొడిగింపు అడగరాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Last Updated : Aug 1, 2019, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details