తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు - బాధ్యతలు

17వ లోక్​సభకు ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​. తొలుత సభా నాయకుడు నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు. అనంతరం ప్యానెల్​ ప్రిసైడింగ్​ అధికారులు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

లోక్​సభలో ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం

By

Published : Jun 17, 2019, 12:24 PM IST

Updated : Jun 17, 2019, 2:16 PM IST

ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు

17వ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రధాని మోదీతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​. అనంతరం ప్యానెల్​ ప్రిసైడింగ్​ అధికారులు కె.సురేష్​, బ్రిజ్​భూషణ్​ శరణ్​ సింగ్​, బి.మెహ్తాబ్​లు లోక్​సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

వీరి తర్వాత.. కేబినెట్​ మంత్రులు వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. లఖ్​నవూ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్​ షాలతో ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్​.

తొలిసారి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు షా. గుజరాత్​ గాంధీనగర్​ నియోజకవర్గం నుంచి ఆయన ఘనవిజయం సాధించారు.

నాగ్​పుర్​ ఎంపీగా గెలుపొందిన గడ్కరీ, శిరోమణి అకాలీదళ్​ ఎంపీ హర్​సిమ్రత్​కౌర్​ బాదల్​, అమేఠీ​లో రాహుల్​గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ లోక్​సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

అంతకుముందు జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. సమావేశాల ప్రారంభానికి ముందు.. వీరేంద్ర కుమార్​తో​ ప్రొటెం స్పీకర్​గా ప్రమాణం చేయించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. రాష్ట్రపతి భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది.

ఇదీ చూడండి : వైద్యుల భద్రతపై రేపు సుప్రీంకోర్టు విచారణ

Last Updated : Jun 17, 2019, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details