అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్.. తన సతీమణితో కలిసి దిల్లీలో యోగాసనాలు వేశారు. యోగా వల్ల శరీరం, మనస్సు ధృడంగా ఉంటాయని అన్నారు.
"ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే ఆలోచనను ప్రధాని ప్రపంచం ముందుకు తెచ్చినప్పుడు దీనిని 160కి దేశాలకు పైగా అంగీకరించాయి. ప్రస్తుతం యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు తమ కుటుంబాలతో కలిసి ఇంట్లోనే యోగా చేస్తున్నారు. యోగా శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి "