తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 2.0: కీలక మార్పులతో కొత్త జట్టు - శాఖల కేటాయింపు

రాజకీయపరంగా దేశంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరైన భాజపా అధ్యక్షుడు అమిత్​ షా... ఇకపై పరిపాలనపరంగానూ కీలక పాత్ర పోషించనున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఈమేరకు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.

అమిత్​షాకు హోం...రాజ్​నాథ్​కు రక్షణ శాఖ

By

Published : May 31, 2019, 1:37 PM IST

Updated : May 31, 2019, 7:36 PM IST

మోదీ మంత్రిమండలిలో మంత్రులు వీరే

కేంద్ర మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపు పూర్తయింది. ప్రధాని నరేంద్రమోదీ సిఫార్సులకు ఈ మేరకు ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. కొందరు పాత శాఖల్లోనే కొనసాగితే.. మరికొందరి శాఖల్లో మార్పు కలిగింది. కొత్తవారికీ కొన్ని కీలక శాఖలను ఇచ్చింది మోదీ సర్కార్​.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అమిత్​ షాకు కేంద్ర హోంమంత్రి పదవి దక్కింది. ఇంత కాలం ఆ శాఖ బాధ్యతలు నిర్వహించిన రాజ్​నాథ్​ సింగ్​కు... రక్షణ శాఖ కేటాయించారు.

గత ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్​కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. అనారోగ్య కారణాలతో అరుణ్​ జైట్లీ తప్పుకోవడం వల్ల అనూహ్యంగా సీతారామన్​కు ఈ శాఖ దక్కింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి అనురాగ్​ ఠాకూర్​కు కేటాయించారు. వీరిద్దరూ అరుణ్​ జైట్లీకి సన్నిహితులే.

ఎవరికీ కేటాయించని సిబ్బంది వ్యవహారాల శాఖ, అణు శక్తి, అంతరిక్షం వంటి కీలకమైన శాఖలు ప్రధాని నరేంద్రమోదీ ఆధీనంలోనే ఉన్నాయి.

కాంగ్రెస్​ కంచుకోట అమేఠీలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి మహిళ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. గత ప్రభుత్వంలో నిర్వర్తించిన జౌళిశాఖ ఆమె వద్దే ఉండనుంది.

గతంలో విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన ఎస్​.జైశంకర్​కు విదేశాంగ శాఖ మంత్రి పదవి దక్కింది. ఓ దౌత్యాధికారి విదేశాంగ శాఖ బాధ్యతలు స్వీకరిచడం ఇదే తొలిసారి.

భాజపా తొలి హయాంలో రోడ్డు రవాణా, రహదాల శాఖ మంత్రిగా సమర్థంగా పని చేశారని పేరు తెచ్చుకున్న నితిన్​ గడ్కరీ అదే శాఖలో కొనసాగనున్నారు. ఆయనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించారు.

గత ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన పియూష్​ గోయల్​కు ఈసారి అవే బాధ్యతలు దక్కాయి. కీలకమైన వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి బాధ్యతలనూ ఆయనే నిర్వర్తించనున్నారు. గతంలో పియూష్​ వద్ద ఉన్న బొగ్గు గనుల శాఖను నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చిన ప్రహ్లాద్​ జోషికి అప్పగించింది మోదీ సర్కార్​. ఆయన పార్లమెంటు వ్యవహారాలు, గనుల శాఖ మంత్రిగానూ సేవలు అందించనున్నారు.

న్యాయ, సామాచార సాంకేతిక మంత్రిగా రవి శంకర్​ ప్రసాద్​ కొనసాగనున్నారు. ఆయనకు టెలికాం శాఖ కూడా దక్కింది. చమురు, సహజవాయువు శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్​ కొనసాగనున్నారు. అదనంగా ఉక్కు శాఖ బాధ్యతలూ అప్పగించారు.

కొత్తగా సృష్టించిన జల్​శక్తి శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు గజేంద్ర సింగ్​ షెకావత్​.

వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రి పదవిని నరేంద్ర సింగ్​ తోమర్​ దక్కించుకున్నారు. సమాచార ప్రసార శాఖతో పాటు పర్యావరణ శాఖను ప్రకాశ్​ జావడేకర్​కు కేటాయించారు.

సదానంద గౌడకు రసాయనాలు, సేంద్రియ ఎరువుల శాఖను అప్పగించగా, ఫుడ్​ ప్రాసెసింగ్​ మంత్రిగా అకాలీదళ్​ నేత హర్​సిమ్రన్​ కౌర్​ బాదల్​ కొనసాగనున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన తావర్​చంద్ గహ్లోత్​ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా వ్యవహరించనున్నారు.

విమానయాన శాఖ స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవిని మాజీ దౌత్యాధికారి హర్​దీప్​ పురి దక్కించున్నారు. విద్యుత్​, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రిగా కొనసాగనున్నారు ఆర్​కే సింగ్​.

ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన సంతోశ్​ కుమార్​ గంగ్వార్​ స్వతంత్ర హోదాతో కార్మిక, ఉద్యోగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి 353 లోక్​సభ స్థానాలు రాగా, ఒక్క భాజపానే 303 స్థానాలు సాధించింది.

కేబినెట్​ మంత్రులు....

  • నరేంద్రమోదీ- సాధారణ పరిపాలన, కేటాయించని ఇతర శాఖలు
  • రాజ్​నాథ్​సింగ్- రక్షణ శాఖ
  • అమిత్​షా- హోంశాఖ
  • నితిన్​ గడ్కరీ- రవాణా శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
  • సదానంద గౌడ- రసాయనాలు, ఎరువుల శాఖ
  • నిర్మలా సీతారామన్- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
  • రామ్​ విలాస్ పాసవాన్- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ
  • నరేంద్ర సింగ్​ తోమర్​- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్​ శాఖ
  • రవిశంకర్​ ప్రసాద్​- న్యాయశాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఐటీ శాఖ
  • హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్- ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
  • థావర్​ చంద్ గెహ్లోత్​- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
  • ఎస్​ జైశంకర్- విదేశాంగ శాఖ
  • రమేశ్​ పోఖ్రియాల్​ నిషాంక్- మానవ వనరుల అభివృద్ధి శాఖ
  • అర్జున్ ముండా- గిరిజన వ్యవహారాల శాఖ
  • స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమ శాఖ, జౌళి శాఖ
  • హర్షవర్దన్‌- ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ప్రకాశ్‌ జావడేకర్‌- అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐఅండ్‌బీ
  • పీయూష్‌ గోయల్‌- పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు
  • ధర్మేంద్ర ప్రధాన్‌- పెట్రోలియం, ఉక్కు
  • ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ- మైనారిటీ వ్యవహారాలు
  • ప్రహ్లాద్‌ జోషి- పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
  • మహేంద్రనాథ్‌ పాండే- నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రైన్యూర్‌ షిప్‌
  • అరవింద్‌ సావంత్‌- భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
  • గిరిరాజ్‌ సింగ్‌- పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్‌
  • గజేంద్రసింగ్‌ షెకావత్‌ - నీటివనరులు(జల్‌ శక్తి)

స్వతంత్ర హోదాలో....

  • సంతోష్‌ కుమార్‌ గాంగ్వర్‌ - శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
  • ఇంద్రజీత్‌ సింగ్‌ – ప్రణాళిక, గణాంక శాఖ
  • శ్రీపాద యశోనాయక్‌ - ఆయుష్‌, రక్షణ శాఖ సహాయమంత్రి
  • జితేంద్రసింగ్‌ - సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ
  • జితేంద్రసింగ్‌ - అంతరిక్ష పరిశోధన, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు
  • జితేంద్రసింగ్‌ - పీఎంవో సహాయమంత్రి
  • కిరణ్‌ రిజిజు - క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు
  • ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ - సాంస్కృతిక పర్యాటక శాఖ
  • రాజ్‌కుమార్‌ సింగ్‌ - విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి
  • హర్‌దీప్‌ సింగ్‌ పూరి – గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
  • మన్‌సుఖ్‌ మాండవ్య – షిప్పింగ్‌, రసాయనాలు, ఎరువులు


సహాయ మంత్రులు...

  • ఫగన్‌సింగ్‌ కులస్థే - ఉక్కు శాఖ సహాయమంత్రి
  • అశ్వనీకుమార్‌ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి
  • అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయమంత్రి
  • జనరల్‌ వీకే సింగ్‌ - రహదారులు, రవాణా శాఖ సహాయమంత్రి
  • కిషన్‌పాల్‌ - సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి
  • రావు సాహెబ్‌ దాన్వే - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయమంత్రి
  • కిషన్‌రెడ్డి - హోంశాఖ సహాయమంత్రి
  • పురుషోత్తమ్‌ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయమంత్రి
  • రాందాస్‌ అథవాలే - సాంఘిక న్యాయం, సాధికారత సహాయమంత్రి
  • సాధ్వి నిరంజన్‌ జ్యోతి - గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి
  • బాబుల్‌ సుప్రియో - అటవీ పర్యావరణ శాఖ సహాయమంత్రి
  • సంజీవ్‌కుమార్‌ బల్యాన్‌ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్‌ సహాయమంత్రి
  • సంజయ్‌ ధోత్రే - మానవ వనరులు, కమ్యూనికేషన్‌, ఐటీ శాఖ సహాయమంత్రి
  • అనురాగ్‌ ఠాకూర్‌ - ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
  • సురేష్‌ చిన బసప్ప – రైల్వే శాఖ సహాయమంత్రి
  • రతన్‌లాల్‌ కఠారియా - నీటివనరులు, సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి
  • మురళీధరన్‌ - పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
  • రేణుకా సింగ్‌ సరూటా - గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి
  • సోంప్రకాశ్‌ - పరిశ్రమలు, వాణిజ్యం సహాయమంత్రి
  • రామేశ్వర్‌ తేలి - ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
  • ప్రతాప్‌చంద్ర సారంగి - మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ సహాయమంత్రి
  • కైలాస్​ చౌదరి - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి
  • దేవశ్రీ చౌదరి - మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయమంత్రి
Last Updated : May 31, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details