తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీరీల హక్కులను పాక్​ హరిస్తోంది'

అంతర్జాతీయ సమాజం ఎదుట పాక్​ వైఖరిని భారత్​ ఎండగట్టింది. దాయాది దేశం వల్ల పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ప్రజలు అనేక ఇబ్బందులకు గురువుతున్నారని ఉద్ఘాటించింది. వారి ప్రాథమిక హక్కులను సైతం పాకిస్థాన్ కాలరాస్తోందని ప్రపంచ దేశాలకు తెలిపింది.

భారత ప్రతినిధి

By

Published : Mar 13, 2019, 9:09 AM IST

జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం 40 వ సమావేశంలో పాక్​ వైఖరిని భారత్​ తప్పుబట్టింది. ఆక్రమిత కశ్మీర్​లో పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని ప్రపంచ దేశాలకు గుర్తుచేసింది. పాక్​ వ్యూహాల్లో భాగంగా ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించినట్టు ఆ దేశ​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సైతం అంగీకరించారని తెలిపింది. ఇప్పటికైనా పాకిస్థాన్​ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించింది. ఆక్రమిత కశ్మీర్​ను వదలి వెళ్లిపోవాలని ఉద్ఘాటించింది.

అంతర్జాతీయంగా భారత్​కు వ్యతిరేకంగా పాక్​ చేస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు భారత ప్రతినిధి మిని కుమామ్.

జెనీవా సమావేశం

"పాకిస్థాన్​ ఐక్యరాజ్యసమితి మండలిలో భారత్​పై తప్పుడు ప్రచారాలు చేస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆక్రమిత కశ్మీర్​ ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్థాన్​ హరిస్తోంది. భారత్​పై అసూయతో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి సమర్పించిన పక్షపాత నివేదికను కూడా మేం వ్యతిరేకిస్తున్నాం. పాక్​ ఆక్రమిత ప్రజలపై కొనసాగుతున్న దుశ్చర్యల గురించి ఆ నివేదికలో ప్రస్ఫుటం చేయలేదు. అక్కడి ప్రజలు తీవ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలను అంటరానివారిగా చూస్తున్నారు. ఈ విషయాలను నివేదికలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది."
- మిని కుమామ్, ఐరాస శాశ్వత భారత ప్రతినిధి

ఇదీ చూడండి:"పటిష్ఠంగా వైమానిక స్థావరాలు"

ABOUT THE AUTHOR

...view details