తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షా 'క్రోనాలజీ' వ్యాఖ్యలపై ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు - LATEST PROTESTS AT INDIA

ఎన్​ఆర్​సీ, సీఏఏపై అమిత్​ షా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ వాద్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వివక్ష చూపుతోందని ఆరోపించారు.

'Understand the chronology': Priyanka takes dig at Amit Shah over NRC remarks
షా 'క్రోనాలజీ' వ్యాఖ్యలపై ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు

By

Published : Dec 27, 2019, 5:40 PM IST

Updated : Dec 28, 2019, 12:02 AM IST

షా 'క్రోనాలజీ' వ్యాఖ్యలపై ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు

జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్​ఆర్​సీ), పౌరసత్వ చట్టం(సీఏఏ)ల చరిత్రను తెలుసుకోండని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి​ ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వివక్ష చూపుతోందని ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్​ షాపై తీవ్ర విమర్శలు చేశారు.

షా వ్యాఖ్యలపై ప్రియాంక ట్వీట్​

"ఒక్కసారి 'చరిత్రను అర్థం చేసుకోండి.' మొదట 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మీకు వాగ్దానం చేస్తారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మీ విశ్వవిద్యాలయాలపై దాడి చేస్తారు. ఆపై రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. అప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా మీరు నిరసనలు తెలుపుతారు. వారు మిమ్మల్ని మూర్ఖులుగా పరిగణిస్తారు. అయినా యువభారతం పోరాడుతూనే ఉంటుంది."

-ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఏప్రిల్​లో జరిగిన లోక్​సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఉద్దేశిస్తూ "దయచేసి చరిత్రను అర్థం చేసుకోండి" అని షా అన్నారు. దేశంలో మొదట పౌరసత్వ బిల్లు(సీఏబీ) ప్రవేశ పెట్టిన తర్వాత, ఎన్​ఆర్​సీని తీసుకొస్తామని.. ఇది కేవలం బంగాల్​​కు వర్తించదని, దేశమంతటా ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ఆనాడు తెలిపారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రియాంక విమర్శలు గుప్పించారు.

Last Updated : Dec 28, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details