అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ అనుచరుడు టైగర్ హనీఫ్‌ను అప్పగించాలన్న భారత్ వినతిని బ్రిటన్ తోసిపుచ్చింది. ఈ విషయాన్ని బ్రిటన్ హోంశాఖ కార్యాలయం స్పష్టం చేసింది.
హనీఫ్ పూర్తి పేరు.. మహ్మద్ హనీఫ్ ఉమర్జీ పటేల్. హనీఫ్‌కు 1993 సూరత్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్లతో సంబంధం ఉంది. అతడిని 2010 ఫిబ్రవరిలో మాంచెస్టర్‌లోని బాల్టన్లో స్కాట్‌ల్యాండ్ యార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత అధికారులు తనను చిత్రహింసలు పెడతారని.. అందుకని బ్రిటన్‌లోనే ఉండటానికి అనుమతులివ్వాలని బ్రిటన్ కోర్టుకు అనేకమార్లు విన్నవించుకున్నాడు 57ఏళ్ల హనీఫ్. కానీ అవన్నీ వీగిపోయాయి.
అయితే అతడు చివరి సారిగా చేసిన అభ్యర్థనపై అప్పటి హోం మంత్రి సాజిద్ జావేద్ సానుకూలంగా స్పందించారు. ఫలితంగా గతేడాది భారత్ చేసిన విజ్ఞప్తిని పాకిస్థాన్ సంతతి సాజిద్ కొట్టివేశారు.