మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. 24 గంటలుగా కురుస్తోన్న వర్షాలకు ఉజ్జయినిలోని శిప్రా నది ప్రవాహం పెరిగింది. నది ఉద్ధృతికి రాంఘాట్లో ప్రధాన, చిన్న ఆలయాలన్నీ నీట మునిగాయి.
ఉజ్జయిని: ముంచెత్తిన వరద- మునిగిన ఆలయాలు
మధ్యప్రదేశ్ ఉజ్జయినిని కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాంఘాట్లోని ఆలయాలు శిప్రా నది ఉద్ధృతికి నీట మునిగాయి.
ఉజ్జయిని: ముంచెత్తిన వరద.. మునిగిన ఆలయాలు
ఆ ప్రాంతంలోని వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నది ప్రవాహం పెరగడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రజలను తరలించాల్సినంత అత్యవసర పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.
Last Updated : Sep 30, 2019, 12:10 AM IST