తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5 రోజులుగా బోరుబావిలోనే పంజాబ్ చిన్నారి - బోరుబావి

పంజాబ్​ సంగ్రూర్​ జిల్లా భగవాన్​పురలో బోరుబావిలో పడిన చిన్నారి ఫతేవీర్​ను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు బాలుడి పుట్టిన రోజు కావడం వల్ల సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. రెండు వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని ఆస్పత్రికి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

బోరుబావిలో పడిన చిన్నారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

By

Published : Jun 10, 2019, 3:15 PM IST

Updated : Jun 10, 2019, 6:17 PM IST

ఈ నెల 6న పంజాబ్​లోని సంగ్రూర్ జిల్లా భగవాన్​పురలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి ఫతేవీర్​ను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫతేవీర్ పడిపోయిన బోరుబావి 150 అడుగుల లోతుగా ఉంది.

ఈ రోజు ఫతేవీర్​ పుట్టిన రోజు. బాలుడు సురక్షితంగా బయటకు రావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి పీజీఐ ఆస్పత్రి నుంచి వైద్యబృందం సంగ్రూర్​లోని ఘటనా స్థలానికి చేరుకుంది.

ఫతేవీర్​ను రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్​ను చేపడుతున్నాయి. సహాయక చర్యల్లో స్థానికులూ సహకారాన్నందిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సునామ్-మాన్సా రహదారిపై పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

భగవాన్​పురలోని తమ ఇంటిలో ఆడుకుంటున్న రెండేళ్ల ఫతేవీర్ పక్కనే ఉన్న బోర్​వెల్​లో పడిపోయాడు. ఇప్పటివరకూ ఎలాంటి ఆహారం పిల్లాడికి అందలేదని అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ మాత్రమే పంపించామని స్పష్టం చేశారు.
ఐదు రోజులైనా బాలుడు బయటకు రాకపోవడం వల్ల స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బోరుబావిలో పడిన చిన్నారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇదీ చూడండి: మమతది కిమ్​జోంగ్​ వ్యక్తిత్వం: గిరిరాజ్​

Last Updated : Jun 10, 2019, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details