తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ములో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరుల హతం - అనంతనాగ్

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. సైనికులు, ముష్కరుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి బలగాలు.

జమ్ములో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరుల హతం

By

Published : Apr 25, 2019, 7:36 AM IST

Updated : Apr 25, 2019, 9:52 AM IST

జమ్ములో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలోని బిజ్​బెహర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు.

బగెందర్​ మొహల్లా ప్రాంతంలో దాగి ఉన్న ముష్కరులు ఒక్కసారిగా సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు కాల్పులతో దీటైన సమాధానమిచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

బిజ్​బెహర ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి బలగాలు.

ఇదీ చూడండి: నేడు వారణాసికి ప్రధాని మోదీ.. రేపే నామినేషన్​

Last Updated : Apr 25, 2019, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details