జమ్ముకశ్మీర్లో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. సైనికుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
పుల్వామాలో ఎన్కౌంటర్-ఇద్దరు ముష్కరులు హతం - awanthipora
జమ్ముకశ్మీర్ పుల్వామాలో సైనికులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
పుల్వామాలో ఎన్కౌంటర్-ఇద్దరు ముష్కరులు హతం
పుల్వామా జిల్లా అవంతిపొరాలోని సంబూరా ప్రాంతంలో.. ఉగ్రవాదులు నక్కిఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టింది సైన్యం. ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీటుగా తిప్పికొట్టిన సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరు ఏ ముఠాకు చెందినవారో తెలియాల్సి ఉంది.
పరిసర ప్రాంతాల్లో ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.