తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై నిషేధం లేదు.. కానీ!' - national news

సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. నిషేధం కాకుండా ప్రోత్సాహం లభించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం పరిశీలిస్తోందని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వీకే జిందాల్.. ఈటీవీ భారత్​తో తెలిపారు.

Twist in centre's approach over single use plastic

By

Published : Oct 19, 2019, 12:49 PM IST

సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ నిషేధంపై అయోమయం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదని.. కానీ వినియోగించడానికి ఎలాంటి ప్రోత్సాహం లభించదని తెలిపింది.

2022లోపు సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వినియోగం పూర్తిస్థాయిలో నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై స్పష్టతనివ్వాలని కేంద్రాన్ని పరిశ్రమల సంఘాలు కోరాయి. ఇదే విషయంపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వీకే జిందాల్​.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

వీకే జిందాల్

"సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ నిషేధం మా ఆశయం కాదు. వాటి వాడకానికి ప్రోత్సాహం లభించకుండా చేయటమే ముఖ్య లక్ష్యం."

-వీకే జిందాల్

ప్రత్యామ్నాయ మార్గాలు

వాడుకలో ఉన్న ప్లాస్టిక్​ను ప్రత్యామ్నాయ అవసరాలు తీర్చే విధంగా పలు సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

"భారత్​లోని 46 సిమెంట్​ పరిశ్రమలను ఎంపిక చేయాల్సి ఉంది. ఇవి పునరుత్పత్తి చేయలేని, సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ ద్వారా ప్రత్యామ్నాయ ఇంధనం తయారు చేస్తాయి. జాతీయ రహదారుల నిర్మాణంలోనూ ప్లాస్టిక్​ వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 10 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయి."

-వీకే జిందాల్

ఉద్యోగుల భవిష్యత్తు..

ప్లాస్టిక్​ నిషేధం నేపథ్యంలో 10 వేల తయారీ సంస్థలు మూతపడనున్న కారణంగా 4.5 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరికి మరో పర్యావరణ హితమైన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

"అన్ని కర్మాగారాలు ప్లాస్టిక్​ పరిశ్రమలు కాదు. 90 శాతం ప్లాస్టిక్​ను వేరే రంగాలకు వాడతారు. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ పరిశ్రమలు పరిమితమైనవి. ఇవి తగ్గిపోతే చాలా సంస్థలు ఉద్భవిస్తాయి. కాగితపు సంచులు వంటి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తాయి."

-వీకే జిందాల్

పరిశ్రమల మనుగడ

నివేదికల ప్రకారం భారత్​లో ఏటా 140 కోట్ల టన్నుల ప్లాస్టిక్​ను వాడుతున్నారు. అఖిల భారత ప్లాస్టిక్​ తయారీదారుల సంఘం లెక్కల ప్రకారం.. దేశంలో 50 వేల ప్లాస్టిక్​ కర్మాగారాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 3.5 లక్షల ఆదాయం వస్తోంది.

ఈ విషయంపై గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది.

"స్వచ్ఛభారత్​ మిషన్​ ప్రారంభించినప్పుడు అసాధ్యమని భావించాం. కానీ ఇప్పుడు ఫలితాలు చూడండి. ప్రజల్లో పారిశుద్ధ్యం పెరిగింది. భారత్​ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా ఆవిర్భవించింది."

-వీకే జిందాల్​

ABOUT THE AUTHOR

...view details