తెలంగాణ

telangana

ETV Bharat / bharat

45 నిమిషాల పాటు పేలిన గ్యాస్​ సిలిండర్లు

గ్యాస్​ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించటం వల్ల భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లోని ఉధమ్​పుర్​ జిల్లాలో జరిగింది.

Truck carrying LPG cylinders catches fire in Jammu and Kashmir's Udhampur
45నిమిషాల పాటు పేలిన గ్యాస్​ సిలిండర్లు.. ఎక్కడంటే..?

By

Published : May 29, 2020, 7:29 PM IST

జమ్ముకశ్మీర్​ ఉధమ్​పుర్​ జిల్లాలో గ్యాస్​ సిలిండర్లను తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైంది. మంటలు వ్యాప్తించటం వల్ల దాదాపు 45 నిమిషాల పాటు గ్యాస్​ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

45నిమిషాల పాటు పేలిన గ్యాస్​ సిలిండర్లు

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

మార్గమధ్యలో మంటలు...

లారీ జమ్ములోని బారి బ్రాహ్మణ నుంచి ఉత్తర కశ్మీర్​లోని సోపోర్​కు 300 గ్యాస్​ సిలిండర్లను తీసుకెళ్తుండగా... తిక్రీ ప్రాంతానికి వచ్చే సరికి అకస్మాత్తుగా మంటలు చేరలేగాయని అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి కొన్ని సిలిండర్లు 100 అడుగులు దూరంలో పడినట్లు పేర్కొన్నారు. లారీ డ్రైవర్​ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.

ఇదీ చూడండి:'ఇండియా' పేరు మార్పుపై జూన్​ 2న సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details