తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెత్తకుండీల కోసం సీఎం 6 నెలల జీతం విరాళం - విప్లవ్​ కుమార్​ దేవ్

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్​ కుమార్​ దేవ్​ తన ఉదారగుణాన్ని చాటుకున్నారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో చెత్తకుండీల ఏర్పాటు కోసం ఆయన ఆరు నెలల జీతం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్​ రహిత త్రిపురతో పాటు... రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు.

6 నెలల జీతం విరాళంగా ప్రకటించిన త్రిపుర సీఎం

By

Published : Sep 14, 2019, 6:22 AM IST

Updated : Sep 30, 2019, 1:15 PM IST

6 నెలల జీతం విరాళంగా ప్రకటించిన త్రిపుర సీఎం

త్రిపురను స్వచ్ఛ, ప్లాస్టిక్​ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్​ కుమార్​ దేవ్​. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1100 గ్రామాల్లోని మార్కెట్లలో చెత్తకుండీల ఏర్పాటు కోసం ఆయన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

త్రిపురను పరిశుభ్రంగా ఉంచుతూ.. ప్లాస్టిక్​ను నిషేధించేందుకు అన్ని గ్రామాల అధినేతలు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు.

సెప్టెంబర్​ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది భాజపా. నేటి నుంచి వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్​' పేరిట విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు దేవ్​. విప్లవ్​ కుమార్​ దేవ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగానూ ఉన్నారు​.

Last Updated : Sep 30, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details