తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజాసేవకు నేనెందుకు పనికిరాను?'

లోక్​సభతో పాటు ఒడిశా శాసనసభకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్​ పార్టీ తరఫున ఓ ట్రాన్స్ జెండర్ బరిలోకి దిగారు.

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రాన్స్​జెండర్ కాజల్

By

Published : Mar 17, 2019, 8:56 AM IST

ఒడిశాలో లోక్​సభతో పాటు శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. కొరై అసెంబ్లీ స్థానంలో పోటీకి ఓ ట్రాన్స్​జెండర్​ బరిలో నిలవటంతో అక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. పోటీ చేసేందుకు కాజల్​ నాయక్​ అనే ట్రాన్స్​ జెండర్ ముందుకురాగా బహుజన్ సమాజ్​ పార్టీ టికెట్ ఖరారు చేసింది.

ఒడిశా జైపూర్​లో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కాజల్ నాయక్. జైపూర్​ ట్రాన్స్​జెండర్ల సమాఖ్యకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది నాయక్.

"చాలా రాజకీయ పార్టీలను సంప్రదించాను. కానీ నన్నెవరూ లెక్క చేయలేదు. నాకు అవకాశం ఇచ్చిన బీఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ట్రాన్స్​జెండర్ల సమాజంపై సానుకూలంగా వ్యవహరించినందుకు పార్టీకి ధన్యవాదాలు."
-కాజల్ నాయక్ , బీఎస్పీ నేత

"వివిధ వర్గాల సాధికారతే బీఎస్పీ లక్ష్యం. ఈ కారణంగానే కాజల్​ నాయక్​కు టికెట్​ ఇవ్వాలని నిర్ణయించాం. ఎవ్వరూ ట్రాన్స్​జెండర్ల గురించి తక్కవ చేసి మాట్లాడకూడదు. వారి అభివృద్ధిని కోరుకుంటే ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలి."
- బీఎస్పీ రాష్ట్ర శాఖ

ABOUT THE AUTHOR

...view details