నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం రేపు చర్చలు జరపనున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో ఆయన భేటీ అయ్యారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై స్పందించే అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.
'షా' తో కేంద్ర మంత్రుల కీలక సమావేశం - కేంద్రం నూతన సాగు చట్టాలు
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్..అమిత్ షాతో భేటీ అయ్యారు. సాగు చట్టాలపై ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం రేపు చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
'షా' తో కేంద్ర మంత్రుల కీలక సమావేశం
సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగనుండటం ఇది ఆరోసారి. ఇప్పటివరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టగా.. సవరణలు తెస్తామని కేంద్రం చెబుతోంది.
ఇదీ చదవండి:గుజరాత్లో భాజపాకు షాక్- ఎంపీ రాజీనామా