మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. నేడు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలని నిర్ణయించింది శివసేన. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సెంట్రల్ ముంబయిలోని సేన భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మహారాష్ట్ర అధికారం విషయంలో చెరిసగం ఫార్ములాను పాటించాలని శివసేన గట్టిగా కోరుతున్నప్పటికీ.. అందుకు భాజపా అంగీకరించడం లేదు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో భాజపా 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ఇటీవల ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేరడం వల్ల శివసేన బలం 62కు చేరింది. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి.