ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లాక్డౌన్ 5.0 పై కేంద్రం ప్రకటన వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. వైరస్ ప్రభావం నుంచి దేశం కోలుకునేందుకు తీసుకున్న చర్యలపై ప్రధాని ప్రజలకు వివరించే అవకాశం ఉంది.
ఉదయం 11 గంటలకు ప్రధాని 'మన్‌కీ బాత్' - lockdown 5.0
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో లాక్డౌన్ 5.0పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మన్‌కీ బాత్కు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రధాని మన్‌కీ బాత్.. లాక్డౌన్ 5.0పై స్పష్టతకు అవకాశం
మోదీ 2.0 ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన దృష్ట్యా గతేడాది సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇటీవలి నెలకొన్న పరిణామాలపై చర్చిస్తారని సమాచారం.