దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 9,181 కొత్త కేసులు బయపడ్డాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5,24,513కు చేరింది. కొవిడ్ ధాటికి మరో 293 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 18,050కు పెరిగింది.
వైరస్ నుంచి కోలుకొని కొత్తగా 6,711 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,58,421కు చేరింది. మరో 1,47,735 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తమిళనాట 3లక్షల కేసులు, 5వేల మరణాలు..
తమిళనాడులో వైరస్ కేసులు అధికమవుతూనే ఉన్నాయి. తాజాగా 5,914 మందికి కొవిడ్ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 3,02,815 కు ఎగబాకింది. కరోనాతో కొత్తగా 114 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,041 కు పెరిగింది.
ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,44,675 మంది వైరస్ను జయించగా.. 53,099 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కర్ణాటకలో కరోనా కొనసాగుతోందిలా..
కన్నడ నాట కొత్తగా 4,267 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,82,354 కు పెరిగింది. కరోనా కారణంగా మరో 114 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,267 కు చేరింది. ఇప్పటివరకు 99,126 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.