తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విజృంభణ.. కొత్తగా 7,924 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 7,924 మందికి పాజిటివ్​గా తేలింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 83వేలు దాటింది. తమిళనాడులో రికార్డు స్థాయిలో దాదాపు 7వేల కేసులు నమోదయ్యాయి. మరో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 21వేలకు చేరగా.. మృతుల సంఖ్య 3వేల 571కి పెరిగింది.

TN reports nearly 7,000 cases for third day, tally zooms to 2.21 lakh
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉద్ధృతం

By

Published : Jul 27, 2020, 8:56 PM IST

Updated : Jul 27, 2020, 10:13 PM IST

దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి అంతకంతకూ తీవ్రమవుతోంది. వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 7వేల924 కేసులు నమోదయ్యాయి. మరో 227 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 83వేల 723కి చేరింది. మరణాల సంఖ్య 13వేల 883కి పెరిగింది. 2లక్షల 21వేల 944మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు.

తమిళనాడులో రికార్డు..

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6,993మంది వైరస్​ బారినపడ్డారు. మరో 77 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 20వేల 716కి చేరింది. మొత్తం 3వేల 571మంది మృతి చెందారు. ఇప్పటివరకు 24లక్షల 14వేల 13మంది నమూనాలు పరీక్షించారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా నమోదైన 5,324 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,01,465కు పెరిగింది. మరో 75మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,953కి చేరింది.

యూపీలో అత్యధికంగా..

ఉత్తర్​ప్రెదేశ్​లో ఇప్పటి వరకు లేని విధంగా ఒక్కరోజే 3,505 కేసులు వెలుగుచూశాయి. మరో 30మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 70వేలు దాటగా.. మృతుల సంఖ్య 1,456కి చేరింది.

ఒడిశాలో..

ఒడిశాలో 24 గంటల్లో 1,500మందికి పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 26,892కు చేరగా.. మరణాల సంఖ్య 147గా ఉంది.

దిల్లీలో తగ్గుముఖం..

దేశ రాజధాని దిల్లీలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 613 మందికి వైరస్​ సోకింది. మరో 26మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,31,219కి చేరింది. ఇప్పటి వరకు 3,853 మంది మరణించారు.

ఇదీ చూడండి: ఒడిశాలో 'కొవాగ్జిన్​​' క్లినికల్​ ట్రయల్స్

Last Updated : Jul 27, 2020, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details